Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
Maulana Shahabuddin Razvi: ఒమర్ అబ్దుల్లా.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లిపై మతపరమైన వివాదం నెలకొన్నది. షరియత్ చట్టం ప్రకారం ఆ పెళ్లి చల్లదు అని ఆల్ ఇండియా ముస్లిం జామత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాహబుద్దిన్ రజ్వీ బరేల్వీ అన్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పెళ్లిపై మతపరమైన వివాదం నెలకొన్నది. ఆల్ ఇండియా ముస్లిం జామత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాహబుద్దిన్ రజ్వీ బరేల్వీ(Maulana Shahabuddin Razvi) ఆ పెళ్లి చట్ట వ్యతిరేకం అన్నారు. ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా ఆ పెళ్లి జరగలేదన్నారు. షరియత్ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న ఇద్దరూ ముస్లిం వ్యక్తులై ఉండాలని, ఇది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా జరిగినట్లు రజ్వీ తెలిపారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం కాగా, రజ్దాన్ ముస్లిం కాదన్నారు. ఆ కారణంగా సీఎం ఒమర్ పెళ్లికి ఇస్లామిక్ సూత్రాల ప్రకారం అనుమతి లేదన్నారు.
నిఖా కన్నా ముందే రజ్దాన్ ముస్లిం మతాన్ని స్వీకరించి ఉంటే అప్పుడు ఆ పెళ్లికి విలువ ఉండేదన్నారు. మతం మార్చుకుని, ఇస్లామిక్ సంప్రదాం ప్రకారం పెళ్లి చేసుకుని ఉంటే దానికి అనుమతి ఉండేదన్నారు. ఇస్లామిక్ మతంలో పెళ్లి విషయంలో ప్రత్యేకమైన రూల్స్, షరతులు ఉన్నాయన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె కచ్చితంగా ముస్లిం వ్యక్తులై ఉండాలన్నారు. ఒకవేళ ఎవరైనా ముస్లిం కాని పక్షంలో, ఆ పెళ్లి చట్టబద్ధం కాదన్నారు. అందుకే ఆ పెళ్లిక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు రిజ్వీ తెలిపారు. రజ్దాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు కాబట్టి, ఆ కలయిక ఇస్లాం చట్ట వ్యతిరేకం అవుతుందన్నారు.
జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో కొత్త ప్రయాణం మొదలుపెట్టనట్లు ఒమర్ అబ్దుల్లా శనివారం పేర్కొన్నారు. నిధితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన షేర్ చేశారు. నిన్నటి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమైందన్నారు. ఒమర్ అబ్దుల్లాకు దూరంగా ఉంటున్న భార్య పాయల్‌కు విడాకులు మంజూరు చేసేందుకు జూలై 31న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంతోపాటు, ఒకరిపై మరొకరు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేయాలని ఉమ్మడిగా కోరారు. ఒమర్ అబ్దుల్లా, పాయల్ 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పాయల్, ఒమర్ 2009 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2011లో ఒమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

