Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 7, 8వ తేదీల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బాణాసంచా పేలుళ్ల గురించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సర్టిఫై అయిన గ్రీన్ ఫైర్‌క్రాకర్స్‌ను పేల్చవచ్చు అని కోర్టు చెప్పింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్(Green Crackers) కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. నవంబర్ 7, 8వ తేదీల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బాణాసంచా పేలుళ్ల గురించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సర్టిఫై అయిన గ్రీన్ ఫైర్‌క్రాకర్స్‌ను పేల్చవచ్చు అని చెప్పింది. అయితే ఆ పటాకులను ఉదయం 6 నుంచి 7 వరకు, ఆ తర్వాత రాత్రి 8 నుంచి 19 వరకు పేల్చాలని కోర్టు పేర్కొన్నది. హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైమరీ, జిల్లా హెల్త్ సెంటర్లు, ఓల్డేజ్ హోమ్‌లు, నొటిఫైడ్ సైలెన్స్ జోన్లకు 300 మీటర్ల పరిధిలో బాణా సంచా పేల్చరాదు అని కోర్టు తెలిపింది. ఈ ప్రదేశాలను నో క్రాకర్స్ జోన్‌గా ప్రకటిస్తారు. బాణాసంచా తయారీదారులు, వ్యాపారులు ఢిల్లీ-ఎన్సీఆర్లో సెక్యూర్టీ డిపాజిట్ చేయాలని, ఆదేశాలను ఉల్లంఘించిన వారు డిపాజిట్ కోల్పోతారని కోర్టు తెలిపింది.
గ్రీన్ క్రాకర్స్‌ను సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ డెవలప్ చేసింది. సంప్రదాయ పటాకుల కన్నా.. గ్రీన్ క్రాకర్స్ 30 శాతం తక్కువ కాలుష్యాన్ని రిలీజ్ చేయాలని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. బేరియం, అల్యూమినియం లాంటి రసాయనాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. డస్ట్, స్మోక్‌ను నొక్కిపెట్టే పదార్ధాలు ఉంటాయి. గ్రీన్ క్రాకర్స్ తక్కువ స్థాయిలో శబ్ధ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. నియంత్రిత మంటతో తక్కువ సమయం ఆ పటాకు కాలుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

