Tamannaah | తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఉత్తరాది భామల్లో టాప్‌లో ఉంటుంది తమన్నా బాటియా. రెండు దశాబ్ధాల కెరీర్లో తను ఏ సినిమాకు సైన్ చేసినా నో కిస్ నిబంధన ఉండటం చాలా మందికి తెలియని విషయం తెలిసిందే. సుదీర్ఘ సినీ కెరీర్లో ఏ సినిమాలో కోసం లిప్ లాక్ సీన్లలో నటించలేదు. లస్ట్ స్టోరీస్ సినిమాతో ఆ రూల్‌ను పక్కన పెట్టేసింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ సన్నివేశాల్లో కనిపిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అయితే సన్నిహిత సన్నివేశాల్లో నటించే విషయంపై తొలిసారి తన స్పందనను తెలియజేసింది మిల్కీ బ్యూటీ.
ఓ నటిగా బలమైన కంటెంట్ ఉన్న సినిమాల్లో తప్పనిసరి అయిన బోల్డ్ సీన్లు, సన్నిహిత సన్నివేశాల్లో నటించే అంశంలో తనకు తాను పరిమితులు విధించుకున్నట్టు చెప్పింది తమన్నా. బోల్డ్ సన్నివేశాలు పూర్తిగా ఫేక్. ప్రతీ సన్నిహిత సన్నివేశాన్ని సెట్లో కోచ్ పర్యవేక్షణలో చిత్రీకరణ చేస్తారు. అలాంటి సీన్లలో నటించేటప్పుడు మేల్ కోస్టార్లకు కొన్ని ప్రాంతాల్లో టచ్ చేయొద్దని కోచ్ ప్రత్యేక సూచనలు ఇస్తారని చెప్పుకొచ్చింది.
అంతేకాదు అలాంటి సన్నివేశాలు సెట్లో అందరూ ఉండగానే సరైన సూచనలతో చాలా జాగ్రత్తగా షూట్ చేస్తారు. ప్రతీ కదలికను డ్యాన్స్ స్టెప్పులను కొరియోగ్రఫీ చేసినట్టుగా షూట్ చేస్తారంటూ చెప్పుకొచ్చింది. తమన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది ఓదెల 2 సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన ఈ భామ ప్రస్తుతం 4 హిందీ సినిమాలను లైన్లో పెట్టింది.
K Ramp | కిరణ్ అబ్బవరం ‘కే రాంప్’ నుంచి ‘ఓనం’ పాట విడుదల
Bishnoi Gang | సల్మాన్‌తో కలిసి ఎవరైనా పనిచేస్తే.. వారిని చంపేస్తాం : బిష్ణోయ్ గ్యాంగ్
Mass Jathara | రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేది అప్పుడే.!