SPB last song | రజినీకాంత్ కోసం ఎస్పీ బాలు పాడిన చివరి పాట వచ్చేసిందిగా..

SPB last song for superstar rajinikanth | రజినీకాంత్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఎవరు పాడుతున్నారు అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 30 30 ఏళ్లుగా అక్కడ ఒక పేరే కనిపిస్తుంది. ఆయన తప్ప రజనీకాంత్ కు మరో సింగర్ ఎవరు పాట పాడటం లేదు. రజినీ సినిమాలో ఇంట్రో సాంగ్ అంటే.. అది పాడాల్సిన ఒకే ఒక సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ( sp balasubramaniam ). వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు అంత పెద్ద హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే బాలు మరణించిన దాదాపు 13 నెలల తర్వాత రజనీకాంత్ కోసం ఆయన పాడిన చివరి పాట ఇప్పుడు విడుదలైంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాతే ( annathe ) సినిమాలో నటిస్తున్నాడు రజనీకాంత్.
ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ 2020 జూన్‌లోనే రికార్డు చేశాడు సంగీత దర్శకుడు డి.ఇమాన్. ఎప్పటి లాగే ఈ పాటను కూడా రజినీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడాడు. పాట రికార్డ్ చేసినప్పుడు ఇది కూడా అన్ని సినిమాల మాదిరే ఒక పాట అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇదే రజనీకాంత్ కోసం బాలసుబ్రమణ్యం చివరి పాట అవుతుందని ఎవరూ అనుకోలేదు.. కలలో కూడా ఊహించలేదు. 2020 ఆగస్టులో అనారోగ్యానికి గురైన బాలు.. సెప్టెంబర్ 25న కన్ను మూశారు. ఎస్పీబీ, రజనీకాంత్ కాంబినేషన్ అంటే చిన్న విషయం కాదు.. 1991లో వచ్చిన తలపతి నుంచి ఇప్పటి దర్బార్ సినిమా వరకు ఈ కాంబినేషన్ కొనసాగింది.
ప్రతి సినిమాలోనూ రజినీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ కేవలం ఎస్పీ బాలుతోనే పాడించారు సంగీత దర్శకులు. రజినీ ఇంట్రో సాంగ్స్ కు ఆయన వాయిస్ అంత బాగా సూట్ అయింది. దళపతి, అన్నామలై, ముత్తు, బాషా, నరసింహ, చంద్రముఖి, శివాజీ, పేట, దర్బార్ ఇలా ఎన్నో సినిమాల్లో రజినీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్స్ తనదైన శైలిలో పాడాడు బాలు. అవన్నీ ఇప్పుడు తలచుకుని బాధ పడుతున్నాడు రజనీకాంత్. మరోవైపు సంగీత దర్శకులు కూడా ఇకపై రజినీ సినిమాల్లో ఎవరితో పాడించాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Maa elections | మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు : పేర్ని నాని
Ram Potineni | హీరో రామ్ పోతినేనికి గాయం
Gangavva: చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?
MAA elections | చిరంజీవి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ప్రకాశ్ రాజ్
నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

