‘మా’ ఎన్నికల సంబంధం లేదు : పేర్ని నాని
ap minister perni nani key statement on maa elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య

అమరావతి : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్నది. ఎన్నికల్లో విజయం తమదేనని ఒకరంటే.. కాదు మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్యానెల్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూనే.. మరో వైపు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది.
ఈ నేపథ్యం ఎన్నికలపై ఏపీ సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. మా ఎన్నికలతో ఏపీ సర్కారుకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్‌కు ఎలాంటి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాము ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్ని సమర్థించడం లేదని పేర్కొన్నారు. మా ఎన్నికలపై తమకు ఉత్సాహం లేదని, తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మా ఎన్నికల ఈ నెల 10న జరుగనున్న విషయం తెలిసిందే.
చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలతో @ysjagan గారికి కాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాని ఎటువంటి సంబంధం లేదు.
— Perni Nani (@perni_nani) October 4, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

