నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు

Anchor suma | టాలీవుడ్లో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా బుల్లితెరపై ఈమె మహారాణి.. ఒక్కముక్కలో చెప్పాలంటే మకుటం లేని మహారాణిగా స్మాల్ స్క్రీన్‌పై చక్రం తిప్పేస్తుంది సుమ. కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించినా కూడా ఆ తర్వాత అది తనకు సూట్ అవ్వదు అని.. దారి మార్చుకుని బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ సుమ. ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా మంచి నటుడు. తెలుగు ఇండస్ట్రీ ఈయనను ఎందుకో సరిగ్గా వాడుకోవడం లేదు.. కానీ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో రాజీవ్ ఎంతో అద్భుతంగా ఓదిగిపోయాడు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలు చూస్తే రాజీవ్ కనకాల ఎంత అద్భుతమైన నటుడు అనేది మనకు అర్థం అవుతుంది అయినా కూడా మన దగ్గర దర్శక నిర్మాతలు రాజీవ్‌ను లైట్ తీసుకున్నారు. అప్పటికీ అప్పుడప్పుడు తనలో ఎంత మంచి నటుడు ఉన్నాడు అనేది ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే ఉంటాడు రాజీవ్ కనకాల. లో రాజీవ్ కనకాల నటించిన లవ్ స్టోరీ విడుదలైంది. ఈ క్రమంలో రాజీవ్ కనకాలపై యాంకర్ సుమ కీలక వ్యాఖ్యలు చేసింది.

లవ్ స్టోరీ సినిమాలో రాజీవ్ కనకాల ప్రేక్షకులు అసహ్యించుకునే పాత్రలో నటించాడు. సాధారణంగా అలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ రాజీవ్ కనకాల మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ములను నమ్మి ముందడుగు వేశాడు. సొంత అన్న కూతురును చిన్నప్పుడు లైంగికంగా వేధించే బాబాయ్ పాత్ర ఇది. ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ కనకాల ఒప్పుకున్నాడు అంటే.. ముందు ఆయన భార్య సుమ కనకాల కూడా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని సక్సెస్ మీట్లో శేఖర్ కమ్ముల చెప్పాడు. అంతే కాదు లవ్ స్టోరీ సినిమాకు ఈ రోజు ఇంత మంచి ఆదరణ లభిస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రాజీవ్ కనకాల అంటూ దర్శకుడు శేఖర్ కమ్ముల ఒప్పుకున్నాడు.
తాజాగా ఈ సినిమా చూసి ఎమోషనల్ అయ్యింది యాంకర్ సుమ . కొందరు నటులు పాత్రలో లీనమై.. అది తన కోసమే పుట్టింది అని ఒదిగిపోతారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కనకాల కూడా అలాంటి అద్భుతమైన నటుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించింది సుమ. ఇక లవ్ స్టోరీ లాంటి సున్నితమైన ఎమోషనల్ రియలిస్టిక్ డ్రామా అందించిన శేఖర్ కమ్ములని కూడా ప్రశంసలతో ముంచెత్తింది సుమ. నాగ చైతన్య, సాయి పల్లవి కూడా అద్భుతంగా నటించారు అంటూ పొగిడింది. ఏదేమైనా భర్తపై సుమ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మారుతి మంచి రోజులు వచ్చాయి ఈ సినిమా ఇంత తొందరగా పూర్తి చేశాడా?
మెహ్రీన్ కౌర్ కంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
Mehreen Kaur Pirzada: మంచి రోజులు వచ్చాయి సినిమా నటి మెహ్రీన్ పిర్జాదా యోగా ఫొటోస్
Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..
Samantha: ట్విట్టర్లో ఎస్ పేరుని తీసేసిన సమంత..!
Sai dharam tej | హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్..
Kajal: కేక పెట్టిస్తున్న కాజల్ అందాలు.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

