కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఎవరూ ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గత ఏడాది గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ ఏ మాత్రం సినిమాల జోరు తగ్గించలేదు. మరోవైపు ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది.
లక్ష్మీ కల్యాణం చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన కాజల్ వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ నటించింది.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ప్రేమాయణం సాగించి రహస్యంగా అతడిని 2020 అక్టోబర్ 30న వివాహం చేసుకున్న కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కేక పెట్టిస్తుంది. కాజల్ ఫొటో షూట్స్ చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు హాట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుంది. కాజల్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.