ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన ముద్దుగుమ్మ సమంత రూత్ ప్రభు. ఈ అమ్మడు అక్కినేని వారసుడు నాగ చైతన్యని వివాహం చేసుకొని సమంత అక్కినేనిగా మారింది. తన సోషల్ మీడియా పేజెస్ అన్నింటిలో సమంత అక్కినేనిగా పెట్టుకుంది. ట్విట్టర్లో ఎప్పుడైతే ఎస్ అని పెట్టిందో అప్పటి నుండి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలు నిన్న నిజం చేశారు చైతూ- సామ్ జంట.
విడాకుల విషయం ప్రకటించిన తర్వాత సమంత తన ట్విట్టర్లో ఎస్ పేరుకి బదులుగా సమంత అని పేరు రాసుకొచ్చింది. కానీ ఫేస్బుక్లో మాత్రం ఇంకా సమంత అక్కినేనిగానే కొనసాగుతోంది. కావాలనే ఉంచిందా లేక మరిచిపోయిందా అనే దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ఏం మాయ చేశావే సినిమాతో.. సమంత , చైతు ఒకరి మాయలో ఒకరు పడిపోయారు. సుమారు 11 ఏళ్ల పాటు వీళ్ల ప్రేమకు.. నాలుగేళ్ల వివాహ బంధానికి ఊహించని విధంగా ముగింపు పడింది. భార్య, భర్తలుగా విడిపోయిన కూడా ఇద్దరం స్నేహితులుగా కొనసాగుతామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చూడండి