ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలను గమనిస్తే..ప్రతీ చోటా ఎక్కువగా వినిపిస్తోన్న పేర్లేవైనా ఉన్నాయంటే అవి సౌతిండియన్ చిత్రాలే (South Indian cinemas). బాహుహలి 2 తర్వాత దక్షిణాది సినిమాలను హిందీ చిత్రపరిశ్రమ (Bollywood) ను శాసిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు దక్షిణాది సినిమా అంటే పెద్దగా లెక్కచేయని హిందీ హీరోలు ఇపుడు రూటు మార్చారు. సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ (Anil Kapoor) దక్షిణాది సినిమాలను ఆకాశానికెత్తేశాడు.
అనిల్‌కపూర్, హర్షవర్దన్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం థార్. ఈ మూవీ ట్రైలర్ (Thar Trailer) లాంఛ్ చేసిన సందర్భంగా అనిల్ కపూర్ మాట్లాడాడు. సౌత్ ఎప్పుడూ అసాధారణమైన సినిమాలను తీస్తూనే ఉంది. భారతీయ సినిమా డైమెన్షన్ ను మార్చడంలో దక్షిణాది వారు ఎప్పుడూ ముందుంటారు. సౌతిండియా సినిమాలు కొత్త ప్రపంచాల్లోకి చొచ్చుకొని వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నాడు అనిల్ కపూర్.
‘దక్షిణాది చిత్రాలతో నా కెరీర్‌ని ప్రారంభించా. దక్షిణాది సినిమా చాలా బాగా చేయడం నాకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. సౌతిండియా సినిమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వారి నుంచి బాలీవుడ్ ఎంత ఇన్ ఫుట్స్ (నేర్చుకుంటే)తీసుకుంటే..హిందీ సినీ పరిశ్రమకు అంత మంచిదని అన్నాడు అనిల్ కపూర్.
బాలీవుడ్ కు సౌతిండియన్ సినిమా స్ఫూర్తిదాయకమని, ఇండియన్ సినిమాకు పిల్లర్లాంటిదంటూ’ ప్రశంసలతో ముంచెత్తాడు.
రాబోయే కాలంలో దక్షిణాది సినిమాలపై మరిన్ని ప్రశంసలు కురిసేలా సినిమాలుండబోతున్నాయని.. ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాలతో స్పష్టమవుతుంది.