IMDb 2022 | ఐఎండీబీ రేటింగ్-2022లో దక్షిణాది సినిమాలదే పైచేయి.. జాబితా ఇదే
హాలీవుడ్ సినిమాలతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయంటే భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఎలా పెరిగిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన సినిమాల్లో సక్సెస్ రేట్ ఉన్నవి ఎక్కువగా దక్షిణాదివే కావడం విశేషం.
బాహబలి ప్రాంఛైజీ తర్వాత గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమాల మార్కెట్ గణనీయంగా పెరిగిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత కేజీఎఫ్ ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు దక్షిణాది సినిమాల (South cinema)రేంజ్‌ను ప్రపంచానికి చాటాయి. హాలీవుడ్ సినిమాలతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయంటే భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఎలా పెరిగిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన సినిమాల్లో సక్సెస్ రేట్ ఉన్నవి ఎక్కువగా దక్షిణాదివే కావడం విశేషం.
ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్)-2022 టాప్ 10 (IMDb 2022) జాబితా తాజాగా ఈ విషయాన్ని నిరూపిస్తోంది. ఐఎండీబీ రేటింగ్‌లో కూడా దక్షిణాది సినిమాలు మరోసారి తమ రేంజ్ ఏంటో చూపించడం విశేషం. తాజాగా విడుదలైన ఐఎండీబీ టాప్ 10 లిస్టులో (ఆర్డర్ ప్రకారం) ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్, కేజీఎఫ్ చాఫ్టర్ 2, విక్రమ్, కాంతార, రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియన్ సెల్వన్-1, 777 చార్లీ స్థానం సంపాదించుకున్నాయి.
ఐఎండీబీ జాబితా ప్రకారం మూడు తెలుగు సినిమాలు, మూడు తమిళ సినిమాలు, మూడు కన్నడ సినిమాలు కాగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ది కశ్మీర్ ఫైల్స్ ఒక్కటే చోటు దక్కించుకుంది. అంటే దక్షిణాది నుంచి తొమ్మిది ఉంటే.. నార్త్ నుంచి కేవలం ఒక్కటే అన్నమాట. అతిపెద్ద ఇండస్ట్రీగా చెప్పుకునే బాలీవుడ్‌ను దక్షిణాది (ప్రాంతీయ సినిమా) సినిమాలు ఎలా ప్రభావితం చేశాయో తాజా రేటింగ్ చూస్తే తెలిసిపోతుంది. ఐఎండీబీలో స్థానం లభించిన నేపథ్యంలో మేజర్ టీంకు ధన్యవాదాలు తెలియజేశాడు అడివిశేష్.
ఐఎండీబీ 2022 జాబితా ..
#IMDbBestof2022 Most Popular Indian Movies:
1. #RRR
3. #KGFChapter2
4. #Vikram
5. #Kantara
6. #Rocketry
7. #Major
8. #SitaRamam
9. #PS1
10. #Charlie
— Ramesh Bala (@rameshlaus) December 14, 2022
Heart is full ❤️ My thanks to the team of #Major Every single person on this team worked hard to make #MajorTheFilm one of the top 10 films of the year. #MajorSandeepUnnikrishnan’s Blessings. JAI HIND 🇮🇳 https://t.co/SSQ5Yiw9yu pic.twitter.com/WHuHIQ7z4n
— Adivi Sesh (@AdiviSesh) December 14, 2022

Read Also : Ram Charan | ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాంచరణ్‌కు ఆహ్వానం.. వివరాలివే
Read Also : MM Keeravani | మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట విషాదం..
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

