మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 11:17:26

39 మంది చిన్నారుల ప్రాణాల‌కి ర‌క్ష‌ణ‌గా నిలిచిన సోనూసూద్

39 మంది చిన్నారుల ప్రాణాల‌కి ర‌క్ష‌ణ‌గా నిలిచిన సోనూసూద్

ఆప‌త్కాలంలో ఎంద‌రికో అండ‌గా నిలిచిన మాన‌వ‌తా వాది సోనూసూద్‌. క‌ష్టం ఎక్క‌డ ఉంటే తాను అక్క‌డ ప్ర‌త్య‌క్షం అయ్యేవారు. తాజాగా ఆయ‌న  కాలేయం మార్పిడి చికిత్స కోసం ఫిలిప్పీన్స్‌ నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన 39 మంది చిన్నారుల ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. క‌రోనా కారణంగా కొన్నాళ్లుగా ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన వారిని స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేశారు. 

39 మంది చిన్నారులతో కూడిన ప్ర‌త్యేక విమానం నేడు మ‌నీలా నుండి బ‌య‌లు దేరి మ‌రో రెండు రోజుల‌లో ఢిల్లీ చేరుకోనుంది.  ఇందులో ఫిలిప్పీన్స్‌కి చెందిన  చిన్నారులు ఉన్నారు. వీరంతా 1–5 ఏళ్ల వారే. కొంత కాలంగా బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారికి న్యూఢిల్లీలో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయ‌నున్నారు. చిన్నారుల విష‌యంలో సోనూసూద్ చూపిన ఔదార్యంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.


logo