‘రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో..రవి చూడనీ..పాడనీ నవ్య నాదానివో’ అంటూ ఓ సినిమాలో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాట మూవీ లవర్స్ కు గుర్తుండే ఉంటుంది. ఇపుడీ పాటను మరోసారి సినీ జనాలకు గుర్తు చేస్తుంది బాలీవుడ్ (Bollywood) ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ (Sonam Kapoor). ఈ పాట రాసింది తన కోసమే అన్నట్టుగా సోనమ్ కపూర్ బేబి బంప్‌తో దర్శనమిస్తోంది. తన తల్లి సునీతా కపూర్ (Sunita Kapoor)వైట్ సటిన్ శారీ, స్లీవ్ లెస్ బ్రాలెట్టే బ్లౌజ్లో పొడవాటి నెక్లెస్ ఇయర్ రింగ్స్ తో కెమెరాకు ఫోజులిచ్చింది సోనమ్ కపూర్.
ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..అబుజానీ మొదటి బర్త్ డే సాయంత్రాన..ఫర్ లాస్ట్ నైట్ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. స్టన్నింగ్ మామ్ అంటూ రాసుకొచ్చారు. సోనమ్ కపూర్ దిగిన తాజాగా దిగిన స్టిల్స్ రాజా రవి శర్మ పెయింటింగ్స్ (Raja Ravi Varma painting)లా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. 36 ఏళ్ల సోనమ్ కపూర్ 2018లో ఆనంద్ ఆహూజాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అనిల్ కపూర్ తాతయ్య కాబోతున్న నేపథ్యంలో సోనమ్ కపూర్ తాజా స్టిల్స్ చూసి తెగ మురిసిపోతున్నాడట. సోనమ్ కపూర్ చివరిసారిగా 2020లో వచ్చిన ఏకే వర్సెస్ ఏకేలో నటించింది. ప్రస్తుతం ఈ భామ షోమ్ మకీజా దర్శకత్వంలో బ్లింద్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదలపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.