Telugu Film Industry | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు సంబంధించి టాలీవుడ్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యలను పరిష్కారించడానికి 30 మంది సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ప్రకటించింది. ఈ కమిటీలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల రంగాల నుంచి సభ్యులున్నారు. ఈ కమిటీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్‌గా ఉండనున్నట్లు తెలిపారు. నిర్మాతల విభాగం తరపున దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, సి.కల్యాణ్, రవికిషోర్, రవి శంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ. సభ్యులు ఉండనున్నారు.
గత నెల మే 30న విశాఖపట్నంలో జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ కమిటీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై చర్చించి త్వరలోనే పరిష్కార మార్గాలను చూపనున్నట్లు తెలుస్తుంది.
Read More