Aadi Sai Kumar Shambhala Teaser | టాలీవుడ్ యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల.. ఏ మిస్టిక్ వరల్డ్’ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌లో అర్చన అయ్యర్, స్వాసిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్‌కు సమాధానం దొరకనప్పుడు వాటిని మూఢనమ్మకం అంటుంది. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పతనం అంటుంది అనే డైలాగ్‌తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. అనంతరం ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందికి వచ్చి ఒక ఊరిలో పడుతుంది. అయితే అది పడిన తర్వాత నుంచి ఆ ఊరిలో ప్రజలు వింతగా ప్రవర్తిస్తుంటారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు.
Read More