కొండాపూర్, జూన్ 7: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం కొండాపూర్‌లో (Kondapur) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. న్యూ హఫీజ్‌పేట్‌లోని నమాజ ఈదుల్ అజహ ఈద్గా దర్గాహ షరీఫ్ హజ్రత్ సాలార్ ఏ దర్గా ముతవల్లి సజ్జాద నషీన్ సుల్తాన్ అహ్సన్ -ఉద్-దౌలా సాహబ్ ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.