న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదే తరహాలో ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో రాహుల్ ఇవాళ ఓ పోస్టు పెట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రిగ్గింగ్‌పై రాహుల్ రాసిన కథనాన్ని ఓ పత్రికలో పోస్టు చేశారు. ఆ పత్రిక రిపోర్టును ఆయన తన ఎక్స్‌లో పోస్టు చేశారు. రిగ్గింగ్ ప్రజాస్వామ్యానికి 2024 మహారాష్ట్ర ఎన్నికలు బ్లూప్రింట్ అని, ఆ రిగ్గింగ్ ఎలా జరిగిందో ఈ ఆర్టికల్‌లో తెలుస్తుందని రాహుల్ వెల్లడించారు.
అయిదు దశల్లో రిగ్గింగ్ జరుగుతుందని తన కథనంలో రాహుల్ తెలిపారు. తొలి దశలో ఎన్నికల సంఘంలో రిగ్గింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఎలక్టోరల్ రోల్‌కు నకిలీ ఓటర్లను జోడిస్తారన్నారు. ఆ తర్వాత బోగస్ ఓట్ల ఆధారంగా బీజేపీ గెలుస్తుందన్నారు. ఆధారాలను దాచిపెడుతారని చెప్పారు. రిగ్గింగ్‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌తో పోల్చారు. చీటింగ్ చేసిన పార్టీ గెలుస్తుందని, కానీ దాని వల్ల వ్యవస్థలన్నీ నష్టపోతాయన్నారు. ప్రజల్లో విశ్వాసం నాశనం అవుతుందన్నారు. మహారాష్ట్రలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ .. త్వరలో బీహార్ ఎన్నికల్లో జరుగ బోతోందన్నారు. మ్యాచ్ ఫిక్స్ ఎన్నికలు ఏ ప్రజాస్వామ్య దేశానికైనా విషం లాంటిందన్నారు.
288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో.. బీజేపీ 132, శివసేన షిండే 57, ఎసీపీ 41, కాంగ్రెస్ 16, శివసేన ఉద్దవ్ 20, ఎన్సీపీ శరద్ పవార్ ఫ్యాక్షన్‌కు 10 సీట్లు దక్కాయి. అత్యధిక సీట్లు బీజేపీకి దక్కాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎన్నికల సంఘాన్ని అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
How to steal an election?
Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.
My article shows how this happened, step by step:
Step 1: Rig the panel for appointing the Election Commission
Step 2: Add fake voters to the roll
Step 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025