మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 19, 2020 , 15:10:52

మోనాల్‌కు షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. వెక్కివెక్కి ఏడ్చిన గుజ‌రాతీ భామ‌

మోనాల్‌కు షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. వెక్కివెక్కి ఏడ్చిన గుజ‌రాతీ భామ‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం  19 మంది స‌భ్యుల‌తో మొద‌లు కాగా, ఇప్పుడు హౌజ్‌లో ఎనిమిది మంది మాత్ర‌మే ఉన్నారు. వీరిలో స్ట్రాంగ్ ఎవ‌రు , వీక్ ఎవ‌రు అనే క్లారిటీ ప్రేక్ష‌కుల‌లో వ‌చ్చేసింది. అయితే  మ‌రో నెల రోజు షోకు శుభం కార్డ్ ప‌డ‌నుండ‌గా, ఇంటి స‌భ్యుల ఫ్యామిలీస్‌ని  హౌజ్‌లోకి ప్ర‌వేశ పెట్టారు బిగ్ బాస్. బుధ‌వారం రోజు అఖిల్ , హారిక‌, అభిజీత్, అవినాష్ మ‌ద‌ర్స్ ఇంట్లోకి రావ‌డంతో వారిని చూసి హౌజ్‌మేట్స్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఇక ఈ రోజు సోహైల్ తండ్రి, లాస్య భ‌ర్త‌, అరియానా ఫ్రెండ్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్టు ప్రోమో ద్వారా అర్ధ‌మైంది. జున్నుని చూసి చాలా ఎమోష‌న‌ల్ అయింది లాస్య‌. గ్లాస్ పైన ఐ ల‌వ్ యూ అంటూ త‌న లిప్‌స్టిక్‌తో రాసింది. ఇక సోహైల్ తండ్రి త‌న కుమారుడికి ముద్దు ఇచ్చి చాలా బాగా ఆడాలని చెప్పాడు. అయితే మోనాల్ త‌ల్లి నేను నిన్నుక‌ల‌వ‌డానికి రాలేక‌పోయాను అని చెప్ప‌డంతో ఈ గుజ‌రాతీ భామ గుక్క‌ప‌ట్టి ఏడ్చింది. అఖిల్‌, సోహైల్‌లు ఓదార్చే ప్ర‌య‌త్నం చేసిన బాత్‌రూంలోకి వెళ్లి మ‌రీ ఏడ్చింది. అస‌లు ఏం జ‌రిగింద‌నే దానిపై పూర్తి క్లారిటీ రావాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. 


logo