శ్రీరామ్, భావన, ఆర్యమ్యాన్, మహబూబ్ బాషా, కేఎస్ రాజు, బస్వరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ (Software Blues). ఉమా శంకర్ (Uma Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) లాంఛ్ చేశారు. జూన్ 24న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది సాఫ్ట్ వేర్ బ్లూస్. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగుల రోజువారీ కష్టాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నాడు డైరెక్టర్.
‘అనేక ట్విస్టులు, ఊహించని మలుపులు, కథాంశంతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్టు చెప్పాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారికి ఇచ్చిన టార్గెట్లు, ఆ లక్ష్యాలను పూర్తి చేయడానికి వారు ఎదుర్కొనే ఒత్తిడి లాంటి అనేక విషయాలను చూపించడం జరిగిందన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉద్యోగుల్లో ఉన్న అనేక పార్శ్వాలను జనాలు తెలుసుకుంటారు. ఈ సినిమా పాటలు చాలా బాగా వచ్చాయి. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్ మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు ఉమా శంకర్’.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!