నటభూషణ స్వర్గీయ శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి చెన్నైలో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆనారోగ్యంతో ఉన్న ఆమె, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సినీనటుడు కాకపూర్వమే, 1958లో శోభన్‌బాబుకు శాంతకుమారితో వివాహం జరిగింది. శోభన్‌బాబు సినీరంగంలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతున్న సమయంలో కూడా శాంతకుమారి ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. మధ్య తరగతి గృహిణిలా సాదాసీదా జీవితాన్నే ఆమె కొనసాగించారు. శోభన్‌బాబు,శాంతకుమారిలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఏకైక కుమారుడు కరుణశేషుని కూడా వారు సినిమాల వైపు ప్రోత్సహించకుండా, వ్యాపారంలో స్థిరపడేలా చేశారు. శాంతకుమారి
మరణవార్త తెలుసుకుని, పలువురు తెలుగు చలనచిత్ర ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.