కొన్ని తేదీలు తెలుగు ఇండస్ట్రీకి అలా కలిసి వచ్చాయి. అలాగే మే 9వ తేదీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా కలిసొచ్చింది. వివిధ సంవత్సరాలలో ఆ రోజు విడుదలైన అరడజన్ సినిమాలు.. అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయాయి. తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాయి.
1990లో జగదేకవీరుడు అతిలోకసుందరి ఇదే రోజు విడుదలైంది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. అలాంటప్పుడు విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఆ సినిమా విడుదలైన సరిగ్గా సంవత్సరం తర్వాత అదే రోజు గ్యాంగ్ లీడర్ సినిమాతో వచ్చాడు చిరంజీవి. ఇది కూడా సంచలన విజయం సాధించడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఇలా చిరంజీవి మే 9న రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను ఇచ్చాడు.
ఆ తర్వాత ఆరేళ్లకు అంటే 1997 మే 9న వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ ప్రేమించుకుందాం రా.. విడుదలైంది. ఈ సినిమా కూడా రికార్డులను తిరగరాసింది.
ప్రేమించుకుందాం రా వచ్చిన ఐదేళ్లకు 2002 మే 9న మరో అద్భుతమైన సినిమా విడుదలైంది. దాని పేరు సంతోషం. నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను అలరించింది. నాగార్జునకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సంతోషం.
మళ్లీ 2018 మే 9న మరో అద్భుతమైన సినిమా విడుదలైంది. అదే మహానటి. కేవలం ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. రూ.20 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 47 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మహానటి విడుదలైన సరిగ్గా సంవత్సరానికి మే 9న మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా విడుదలైంది. ఇది కూడా మంచి విజయం సాధించింది. వంశీ పైడిపల్లి తెరకెక్కిన ఈ సినిమాకు ఏకంగా మూడు నేషనల్ అవార్డు రావడం గమనార్హం. వ్యవసాయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు వంశీ పైడిపల్లి.
ఇలా నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నేటి మహర్షి వరకు మే 9న విడుదలైన చాలా సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి. అందుకే ఈ తేదీ తెలుగు ఇండస్ట్రీకి ప్రత్యేకంగా మారిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గ్యాంగ్ లీడర్‌గా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా?
అనీల్ రావిపూడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ..!
క్యాలీ ఫ్లవర్ టైటిల్‌తో వస్తున్న సంపూ.. టీజర్ అదుర్స్
త్వరగా కోలుకోవాలని బన్నీకు స్వీట్ మెసేజ్ పంపిన చరణ్ దంపతులు
లైగర్ టీజర్ వాయిదా వేసిన నిర్మాతలు
పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
సాయి పల్లవి పవర్ ఫుల్ లుక్ విడుదల
బిగ్ బాస్ 5 ఈ సారి ఉండేది కష్టమే అంట..!