e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News బిగ్ బాస్ 5 ఈ సారి ఉండేది కష్టమే అంట..!

బిగ్ బాస్ 5 ఈ సారి ఉండేది కష్టమే అంట..!

కరోనా వైరస్ కారణంగా ఏది ప్లాన్ ప్రకారం సాగడం లేదు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లుంది పరిస్థితి ఇప్పుడు. ఇప్ప‌టికే చాలా సినిమాలు వాయిదా ప‌డ్డాయి. టీవీ షోల ప‌రిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఇలాంటి స‌మ‌యంలో నాగార్జున హోస్ట్ చేస్తున్న సక్సెస్ ఫుల్ షో బిగ్‌బాస్ 5 తెలుగు సీజ‌న్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 5 ఈ సారి ఉండేది కష్టమే అంట..!

ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు ఐదో సీజ‌న్ కోసం వేచి చూస్తుంది. మొద‌టి మూడు సీజ‌న్లు ఎలాంటి స‌మ‌స్య లేకుండా పూర్తి అయిపోయాయి. కానీ నాలుగో సీజ‌న్ మాత్రం క‌రోనా కాలంలో వ‌చ్చింది. ఈ సీజ‌న్‌లో ఎంపిక చేసిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరిని రెండు వారాల పాటు క్వారంటైన్ చేసిన త‌ర్వాత కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించ‌లేదు. ఈ సారి కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఉండ‌టంతో గ‌త సీజ‌న్ మాదిరే చేస్తారేమోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌ను చూస్తుంటే అస‌లు ఐదో సీజ‌న్ వ‌స్తుందా లేదా అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

బిగ్ బాస్ 5 ఈ సారి ఉండేది కష్టమే అంట..!

ప్ర‌స్తుతం బ‌య‌ట ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మొద‌టి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో రిస్క్ తీసుకోవ‌డం అవ‌స‌ర‌మా అని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఆలోచిస్తున్నారు. ప‌రిస్థితులు పూర్తిగా చ‌క్క‌బ‌డిన త‌ర్వాతే చూసుకుందాంలే అన్న‌ట్లుగా వాళ్లు ఐదో సీజ‌న్‌ను లైట్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఏడాది చివ‌రి వ‌ర‌కు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే ఓకే.. లేదంటే ఈ ఏడాది బిగ్‌బాస్ లేన‌ట్లే అని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

గ్యాంగ్ లీడ‌ర్‌గా ముందు ఎవ‌రిని అనుకున్నారో తెలుసా?

అనీల్ రావిపూడి ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ..!

క్యాలీ ఫ్ల‌వ‌ర్ టైటిల్‌తో వ‌స్తున్న సంపూ.. టీజర్ అదుర్స్

త్వ‌ర‌గా కోలుకోవాల‌ని బన్నీకు స్వీట్ మెసేజ్ పంపిన చ‌ర‌ణ్ దంప‌తులు

లైగ‌ర్ టీజ‌ర్ వాయిదా వేసిన నిర్మాత‌లు

పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైర‌ల్

సాయి ప‌ల్ల‌వి ప‌వ‌ర్ ఫుల్ లుక్ విడుద‌ల‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిగ్ బాస్ 5 ఈ సారి ఉండేది కష్టమే అంట..!

ట్రెండింగ్‌

Advertisement