Sivakarthikeyan | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి సుధా కొంగర డైరెక్షన్లో రాబోతున్న ఎస్కే 25 (SK25). పీరియాడిక్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ప్రీ లుక్ రూపంలో బయటకు వచ్చింది.
విప్లవం ఎవరి కోసం వేచి ఉండదు.. విప్లవానికి రేపు నాంది పలుకబోతున్నాం.. అంటూ శివకార్తికేయన్ సీసాకు మంటలంటిస్తున్న ప్రీ లుక్ ఒకటి విడుదల చేశారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ టీజర్ రేపు సాయంత్రం 4 గంటలకు ఉండబోతున్నట్టు ప్రకటించారు. శివకార్తికేయన్ ఏదో సరికొత్త పాయింట్‌ను తీసుకురాబోతున్నాడని ఈ లుక్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. జయం రవి, అధర్వ మురళి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇప్పటికే శివకార్తికేయన్ ఎస్కే25 గురించి మాట్లాడుతూ.. ప్రోమో షూట్ పూర్తయిందని చెప్పాడు. జయం రవి సార్ విలన్‌గా నటించడం సంతోషంగా ఉంది. ఇది చాలా పవర్ ఫుల్ రోల్. నేను కాలేజీ రోజుల్లో జయం రవి సార్ సినిమాలు చాలా చూశా. ఆయన సీనియర్. మేమిద్దరం ఫైట్ చేయబోతున్నామంటే ఎక్జయిటింగ్‌గా ఉందన్నాడు.
The revolution waits for no one ✊
Tomorrow marks the beginning🔥Catch the #SK25 Announcement teaser tomorrow at ⏰ 4:00 PM#VivaLaRevolución
🎬 The revolution is yours to witness
Stream it on 🔗 https://t.co/dRQ2AXcho0@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan… pic.twitter.com/lHxAY8m34u— DawnPictures (@DawnPicturesOff) January 28, 2025
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి