SK23 | ఇటీవలే అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి SK23. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా SKxARMగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వార్తను షేర్ చేశారు మేకర్స్.
ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్టు తెలియజేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ మురుగదాస్ టీం కొత్త స్టిల్‌ను షేర్ చేసింది. దీంతోపాటు నెట్టింట కొన్ని లొకేషన్ స్టిల్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. పాపులర్ మాలీవుడ్ యాక్టర్, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్, బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
#SK23 – The Current Schedule has been wrapped up with Action Sequences..🔥 Summer 2025 Release..⭐#Sivakarthikeyan – #ARM – #Anirudh Combo..💥 pic.twitter.com/3Zn78hPtBb
— Laxmi Kanth (@iammoviebuff007) November 22, 2024
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు