SK25 | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) గతేడాది అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడని తెలిసిందే ఈ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న శివకార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ఒకటి సుధా కొంగర డైరెక్షన్లో రాబోతున్న పీరియాడిక్ ఫిల్మ్ ఎస్కే 25 (SK25). తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు శివకార్తికేయన్.
ఎస్కే25 గురించి చెబుతూ.. ప్రోమో షూట్ పూర్తయిందన్నాడు. జయం రవి సార్ విలన్‌గా నటించడం సంతోషంగా ఉంది. ఇది చాలా పవర్ ఫుల్ రోల్. నేను కాలేజీ రోజుల్లో జయం రవి సార్ సినిమాలు చాలా చూశా. ఆయన సీనియర్. మేమిద్దరం ఫైట్ చేయబోతున్నామంటే ఎక్జయిటింగ్‌గా ఉందన్నాడు. అంతేకాదు ప్రోమో షూట్ రెండు రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతుందని చెప్పాడు.
మురుగదాస్‌తో చేస్తున్న ఎస్కే 23 షూటింగ్ 90 శాతం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. సికిందర్ పూర్తయిన తర్వాత మురుగదాస్ సార్ వచ్చాక టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తాం. ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. కానీ రెగ్యులర్ జోనర్ కాదన్నాడు శివకార్తికేయన్.
సినిమా హిట్, ఫ్లాప్ గురించి మాట్లాడుతూ.. సినిమా ఫెయిల్ అయితే నాపై దాడి చేస్తారు.. కానీ సినిమా సక్సెస్ అయితే నాకు తప్ప అందరికి క్రెడిట్ ఇస్తారు.. సక్సెస్‌కు నేను ఒక్కడినే బాధ్యుడిని అని చెప్పను.. కానీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తాను.. ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్ బాధ్యత తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.
“#SK25 Promo shoot completed✅. I’m happy that #Jayamravi sir is doing Antagonist character, it’s a strong role🔥. I have seen many of JayamRavi sir film in college days & he’s senior♥️. I’m excited that we are gonna fight each other🤜🤛”
–#Sivakarthikeyanpic.twitter.com/dt7xSuGh6i— AmuthaBharathi (@CinemaWithAB) January 6, 2025