శివకార్తికేయన్ నటిస్తున్న పానిండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నది. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయని మేకర్స్ చెబుతున్నారు.
ఈ నెల 24న ట్రైలర్, ఆడియో లాంచ్ జరుపనున్నామని, ఏ.ఆర్.మురుగదాస్ కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రుక్మిణి వసంత్ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సుదీప్ ఎలామోన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.