Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి SK21. అమరన్ (Amaran) టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఆర్మీ జవాన్‌గా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు శివకార్తికేయన్.
తాజాగా ఈ బుధవారం అమరన్ అప్డేట్ లోడింగ్ అంటూ ఓ క్రేజీ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ శివకార్తికేయన్ టీం ఏం ప్లాన్ చేసిందనేది పక్కన పెడితే.. ఆ ఎక్జయిటింగ్ న్యూస్ ఏమై ఉంటుందా అని తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. అమరన్‌లో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
కథానుగుణంగా కశ్మీర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది అమరన్ టీం. కశ్మీర్లో 75 రోజులపాటు అమరన్ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఇప్పటికే ఎస్కే 21 కశ్మీర్ షూటింగ్ లొకేషన్లో సాయిపల్లవి, శివకార్తికేయన్ దిగిన ఫొటోలు నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి. మరోవైపు సినిమా కోసం గైడ్ చేసిన రియల్ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ అమరన్ టీం రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Suriya | సూర్య కంగువ మ్యూజికల్ ప్రమోషన్స్ టైం.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Trisha | త్రిష సెల్ఫీ.. ఎక్కడుందో క్యాప్షన్‌తో హింట్ ఇచ్చేసిందా..?
Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్