Suriya | సూర్య కంగువ మ్యూజికల్ ప్రమోషన్స్ టైం.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే కంగువ మ్యూజికల్ ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.
కంగువ ఫస్ట్ సింగిల్‌ను సూర్య బర్త్ డే సందర్భంగా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. తాజా టాక్ ప్రకారం జులై 23న సాంగ్ లాంచ్ ఉండబోతున్నట్టు తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే సూర్య అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో సాంగ్ ఉండటం పక్కా అని అర్థమవుతోంది. కంగువ రెండు పార్టులుగా రాబోతుందని ఇప్పటికే నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా వెల్లడించారని తెలిసిందే.
తాము పార్టు 1, పార్టు 2 కోసం కథ రాశామని.. కొన్ని ఎక్జయిటింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులు పార్టు 2ను ఫాలో అయ్యేలా చేస్తాయని చెప్పి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో, పోస్టర్లు ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తున్నాడు.
కంగువను స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది కంగువ. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.
Read Also :
Trisha | త్రిష సెల్ఫీ.. ఎక్కడుందో క్యాప్షన్‌తో హింట్ ఇచ్చేసిందా..?
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్
కంగువ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

