Sivaji: The Boss Re Release | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో మాస్ సినిమా అంటే వెంటనే గుర్తోచ్చేది శివాజీ ది బాస్ (Sivaji: The Boss). అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2007లో విడుదలై రజనీకాంత్‌కు మాస్ బ్లాక్ బస్టర్‌ను అందించింది. అప్పటివరకు రజనీ చేసిన మాస్ సినిమాలు ఒక ఎత్తు అయితే శివాజీ మరో ఎత్తు. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు, సంగీతం అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇక ”నాన్న పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది.” అంటూ రజనీ చెప్పిన డైలాగ్‌కు అయితే థియేటర్ టాప్ లేచిపోయిందని చెప్పవచ్చు.
అయితే తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రీ రిలీజ్ చేస్తామని ప్రకటించి నాలుగు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరో సారి రీ రిలీజ్ సిద్ధం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం పరిమిత థియేటర్లోనే విడుదల కాబోతున్నట్లు మూవీ టికెట్ కూడా రూ.99గా డిసైడ్ చేసినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Sivaji4K pic.twitter.com/Vo4jp8B4rI
— Aakashavaani (@TheAakashavaani) September 10, 2024
Also Read..