War 2 | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబోలో వస్తున్న చిత్రం వార్ 2 (War 2). అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. స్పై జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వార్ 2 చిత్రం ఆగస్టు 14న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్. వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో ప్లాన్ చేస్తున్నారని.. ఈవెంట్‌కు తారక్, హృతిక్ రోషన్ హాజరవుతున్నారంటూ నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. అయితే వార్ 2 తెలుగు పంపిణీ హక్కులను దక్కించుకున్న పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ పుకార్లను కొట్టిపారేసింది.
వార్ 2 ఈవెంట్ గురించి వస్తున్న కథనాలు పుకార్లు మాత్రమే. ఇప్పటివరకు ఈవెంట్ స్థలం నిర్ణయం కాలేదు. త్వరలోనే ఈవెంట్ గురించి నిర్ణయం తీసుకున్నాక అధికారికంగా ప్రకటిస్తామని ఎక్స్ లో పేర్కొంది. YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో సినిమా వార్ 2. ఈ నేపథ్యంలో వార్ 2పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
The reports being circulated about the #War2 event are mere speculations. No venue has been confirmed yet. We will let you know as soon as it is officially finalized.
— Sithara Entertainments (@SitharaEnts) July 28, 2025
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్