Sitaare Zameen Par | బాలీవుడ్ నటుడు.. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. లాల్ సింగ్ చద్దా వంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమిర్ ఈ సినిమా చేయడంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లు ఆశించినంత అందుకోలేకపోయాయి. ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లు చూసుకుంటే సుమారు ₹ 11.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో వచ్చే వీకెండ్లో అయిన ఈ కలెక్షన్లు దాటుతుందని చిత్రబృందం భావిస్తుంది.
ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. గుల్షన్ అరోరా అనే ఓ కోపిష్ఠి బాస్కెట్‌బాల్ అసిస్టెంట్ కోచ్ జీవితం చుట్టూ తిరుగుతుంది. తన సీనియర్ కోచ్‌తో గొడవపడి, కోపంతో అతడిపై దాడి చేస్తాడు. దీనికి శిక్షగా కోర్టు గుల్షన్‌కు జైలు శిక్ష విధించకుండా, మానసిక సవాళ్లు ఎదుర్కొంటున్న పది మంది యువకులకు మూడు నెలల పాటు బాస్కెట్‌బాల్ శిక్షణ ఇవ్వాలని ఆదేశిస్తుంది. మొదట ఈ పనిని చాలా అసహనంగా భావిస్తాడు గుల్షన్. కానీ నెమ్మదిగా ఆ పిల్లల ఉత్సాహం, వారి సహజసిద్ధమైన ప్రతిభ.. వారి స్వభావం చూసి మారుతాడు. తన వ్యక్తిగత జీవితంలోని వైవాహిక సమస్యలను, తన బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలను అధిగమిస్తూనే, గుల్షన్ తన టీమ్‌ను జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎలా సిద్ధం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ.
Read More