Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) త్వరలోనే దేవర (Devara) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రానికి కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారక్ అండ్ టీం. ఈ సందర్భంగా వెట్రిమారన్‌తో సినిమా చేయాలని తన మనసులో మాటను బయటపెట్టేశాడు తారక్.
మట్టిలో పుట్టే పాత్రలతో మ్యాజిక్ చేసే టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran). ఈ దర్శకుడు కథను నమ్మి సినిమా చేస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక వెట్రిమారన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే నటీనటులు చాలా మందే ఉంటారు. వెట్రిమారన్ సినిమాలకు సినీ జనాలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇంప్రెస్ అయిపోతుంటారు. ఈ స్టార్ డైరెక్టర్ అభిమానుల్లో స్టార్ హీరోలు సైతం ఉంటారు. ఇప్పుడీ జాబితాలో గ్లోబల్ స్టార్ హీరో తారక్ కూడా చేరిపోయాడు.
ప్రమోషనల్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. నా అభిమాన దర్శకుడు వెట్రిమారన్‌ను అడుగుతున్నా.. సార్ దయజేసి నాతో స్ట్రెయిట్ తమిళ సినిమాను తీయండి. మనం తెలుగులో డబ్ చేసుకుందాం..అంటూ విజప్తి చేశాడు. మొత్తానికి అన్నీ కుదిరితే తాను కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పకనే చెబుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు తారక్.
మరి ఈ స్టార్ యాక్టర్ విజ్ఞప్తికి వెట్రిమారన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కొంచెం ఆలస్యమైనా రాబోయే రోజుల్లో తారక్-వెట్రిమారన్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు సినీ జనాలు.
I’ll ask my fav director. #Vetrimaaran sir please do a straight Tamil film with me. We can dub it in Telugu.
– #NTR at #Devara Chennai press meet
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) September 17, 2024
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్