మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జక్కన్న నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) శుభాకాంక్షలు తెలియజేశాడు.
‘రాజమౌళి సార్..మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..మీ సినిమాటిక్ టాలెంట్‌తో మాకు స్పూర్తినిస్తూ ఉండండి. ఎల్లపుడూ ఆనందంగా ఉంటూ..మరెన్నో విజయాలు అందుకోవాలని’ ట్వీట్ చేశాడు మహేశ్ బాబు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 సినిమాతో బిజీగా ఉన్నాడు మహేశ్. ఈ సినిమా పూర్తవగానే రాజమౌళితో చేయనున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో విజువల్ ఫీస్ట్ అందించేలా మహేశ్-జక్కన్న సినిమా ఉండబోతుందని ఇప్పటివరకున్న సమాచారం. ఈ సినిమాతో మహేశ్ ఇంటర్నేషనల్ స్టార్డమ్ సంపాదించడం ఖాయమైనట్టేనంటున్నారు సినీ జనాలు.
Wishing you a happy birthday @ssrajamouli sir… Keep inspiring us with your cinematic brilliance! Happiness & success always!
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2022
Read Also : Dheemthanana Song | అల్లు శిరీష్, అనూ ఎమ్మాన్యుయేల్ ధీంతననా సాంగ్..లిరికల్ వీడియో
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ హీరోయిన్ ఫైనల్..లుక్ విడుదల
Read Also : Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు