Palak Muchhal | బాలీవుడ్ ప్రముఖ గాయని పలక్ ముచ్చల్ (Palak Muchhal) తన మంచి మనసుతో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఆర్థిక సాయం అందక గుండె సమస్యలతో బాధపడుతున్న దాదాపు 3,800 మందికి పైగా పేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిందేందుకు నిధులు సమకూర్చి గిన్నిస్ బుక్‌లో కెక్కింది సింగర్. పలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి నిరుపేద పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించింది ఈ సింగర్. అయితే ఈ విషయంపై ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న సింగర్.. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. పలక్ ముచ్చల్ ఇండోర్‌లో జన్మించింది. ఒకసారి రైలు ప్రయాణంలో పేద పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన పలక్.. నిరుపేద చిన్నారుల కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ సేవా సంస్థను స్థాపించింది.