12A Railway Colony | టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా థ్రిల్లర్ ’12A రైల్వే కాలనీ’. ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తుండగా.. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తుంది. ‘పొలిమేర’ మరియు ‘పొలిమేర 2’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు డాక్టర్ అనిల్విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్కీన్‌ప్లే, సంభాషణలను అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.