Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించాడు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వీకెండ్‌తో కాకుండా వీక్ డేస్‌లో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల చిత్రబృందం నవంబర్ 12న సక్సెస్ మీట్ నిర్వహించబోతుంది. అయితే ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ నటుడు విజయ్ దేవరకొండ రాబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ వేడుక మరింత గ్రాండ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎంగేజ్మెంట్ రూమర్స్ తర్వాత రష్మిక – విజయ్ ఒకేసారి వేదిక మీద కనిపించబోతుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ విషయానికి వస్తే.. భూమా (రష్మిక మందన్న) పీజీ చేయడానికి హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్ లో పీజీ చేయడానికి వచ్చిన విక్రమ్ (దీక్షిత్ శెట్టి) భుమాని చూసి ఇష్టపడతాడు. ఒక బలహీనమైన క్షణంలో భూమా కూడా విక్రమ్ ని ఇష్టపడుతుంది. విక్రమ్ కి జెలసీ, పోసిస్సివెన్స్ ఎక్కువ. తనది పాత కాలం మనస్తత్వం. విక్రమ్ తో రోజులు గడుపుతున్నకొద్ది భూమాకి కొన్ని విషయాలు అర్ధమౌతూవస్తుంటాయి. రిలేషన్షిప్ లో ఓ చిన్న బ్రేక్ కావాలని ఆడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విక్రమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు ? ఈ కథలో దుర్గా (అను ఇమ్మానుయేల్) పాత్ర ఏమిటి? చివరికి భూమా ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మిగతా కథ.