Telangana BYpoll| జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంతో పాటు నటుడు శ్రీకాంత్ కుటుంబం తదితరులు ఓటు హక్కును వినియోగించుకోగా.. తాజాగా నటుడు గోపిచంద్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని మహిళ సమాజం పోలింగ్ కేంద్రంకు వచ్చిన గోపిచంద్ తన ఓటు హాక్కుని వినియోగించుకుని కెమెరాలకు ఫోజులిచ్చాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని మహిళ సమాజం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు గోపీచంద్ pic.twitter.com/HLZ3PRON8p
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025