South Central Railway | విజయవాడ – దువ్వాడ సెక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న నడవనున్న కాకినాడ పోర్టు – విశాఖపట్నం (17267), విశాఖ – కాకినాడ పోర్టు (17268), రాజమండ్రి – విశాఖ (67285), విశాఖ – రాజమండ్రి ( 67286 ) మధ్య నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 12న నర్సాపూర్ – సికింద్రాబాద్, 15వ తేదీన అనకాపల్లి – సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.