They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఓజీ నుంచి HUNGRYCHEETAH గ్లింప్స్ వీడియో లాంచ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రియారెడ్డి కీ రోల్లో నటిస్తోంది. థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కాగా ఇప్పుడొక ఆసక్తికర స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఉన్న స్టిల్ ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ శింబు ఇలా ప్రత్యక్షమవడం వెనక కారణమేంటనుకుంటున్నారా..? తాజా సమాచారం ప్రకారం ఓజీలో శింబు పాట పాడాడు. తాజా ఫొటోతో ఓజీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే పవన్ కల్యాణ్ పాటకు శింబు వాయిస్ ఇవ్వడం మాత్రం మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి.
ప్రపంచాన్ని నాశనం చేసే ముందు.. అబ్బాయిలు.. అంటూ డీవీవీ ఎంటర్టైన్ మెంట్ షేర్ చేసిన స్టిల్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. సుజిత్ 50 శాతం యాక్షన్, 50 శాతం ఎమోషన్స్ ఉండేలా ఓజీ పాత్రలను డిజైన్ చేశాడని.. ఓజీ ప్రపంచాన్ని మీరెవరూ ఊహించలేరంటూ శ్రియా రెడ్డి ఓ చిట్‌చాట్‌లో కామెంట్స్ చేసిందని తెలిసిందే. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్.
The boys before they destroy the world. #OG 💥💣 #TheyCallHimOG pic.twitter.com/YbTLhhX76G
— DVV Entertainment (@DVVMovies) September 22, 2024
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!