Simbu | తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు శింబు. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను పలుకరించిన శింబు ఇక డైరెక్టుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. తమ అభిమాన హీరో తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తాడని ఎదురుచూస్తున్న వారి కోసం ఆసక్తికర వార్త తెరపైకి వచ్చేసింది.
పాపులర్ తెలుగు లీడింగ్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ శింబుతో తెలుగు సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. Manasanamaha షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ రెడ్డి ఇటీవలే నిర్మాతకు ఓ స్క్రిప్ట్ వినిపించగా ఇంప్రెస్ అయిపోయాడట. చర్చలు కూడా ఓ దశకు వచ్చేశాయని.. శింబు కూడా ఒకే చెప్పాడని తెలుస్తోంది.
అన్నీఅనుకున్నట్టుగా కుదిరితే శింబు తెలుగులో చేయనున్న ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా ఇదే కానుందన్నమాట. ఇదే నిజమైతే మరి తెలుగులో కూడా శింబు మార్కెట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారనుంది.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన 2002లో లీడ్ యాక్టర్‌గా తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు. ఆ తర్వాత ఏ మాయ చేశావే చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్‌గా కనిపించాడు. రెండు దశాబ్ధాల తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు శింబు.
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే