సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాకర్టీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మల్లిక గంధా..’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 11న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నట్టు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఓ అందమైన పోస్టర్ని కూడా విడుదల చేశారు. బాల్కనీలో సిద్ధు జొన్నలగడ్డకు కాస్త దూరంగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా నిలబడి ఉన్నారు. సిద్ధు వారివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. వారిద్దరూ మాత్రం ఏటో చూస్తూ నవ్వుతున్నారు. త్రిముఖ ప్రేమకథను సూచించేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: థమన్ ఎస్.