యువహీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘తెలుసుకదా’. ైస్టెలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. పీపుల్‌మీడియా పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. మహారాష్ట్రలో సిద్ధు జొన్నలగడ్డ, కథానాయిక శ్రీనిధి శెట్టిపై చిత్రీకరిస్తున్న సాంగ్‌తో తాజా షెడ్యూల్ మొదలైంది.
24 రోజలపాటు జరిగే ఈ లాంగ్ షెడ్యూల్లో క్రూషియల్ టాకీపార్ట్‌ని కూడా షూట్ చేయనున్నామని మేకర్స్ తెలిపారు. లీడ్ యాక్టర్స్‌తో పాటు సినిమాలోని కీలక నటీనటులంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని వారు తెలిపారు. రాశీ ఖన్నా మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రధారి. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ బాబా, సంగీతం: థమన్.