Jack | టాలీవుడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి జాక్ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ SVCC 37గా వస్తోంది. మేకర్స్ తాజాగా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్‌ను 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా.. రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాక్ సినిమాను ఇదే తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. తాజా లుక్‌లో నిర్మానుష్య ప్రదేశంలో ఓ వైపు జీపు కనిపిస్తుండగా.. మరోవైపు గన్ను చూడొచ్చు. రాజాసాబ్ తేదీన వస్తుండటంతో సూపర్ బజ్ క్రియేట్ అవడం పక్కా అని అర్థమవుతోంది.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి Achu Rajamani సంగీతం అందిస్తున్నారు. సిద్దు జొన్నల గడ్డ దీంతోపాటు నీరజ కోన డైరెక్షన్లో తెలుసు కదా సినిమా చేస్తుండగా.. మరోవైపు టిల్లు 3 కూడా లైన్లో ఉంది.
He’s JACK-ed up and locked in for action 🔥
Cracking a new level of entertainment in cinemas from April 10, 2025. 🤟🏻 #Jack #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial @vamsikaka #SVCC37 #JackTheMovie pic.twitter.com/zI9rKvCjth
— SVCC (@SVCCofficial) December 18, 2024
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?