Siddharth Roy | సిద్ధార్థ్ రాయ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్.. అర్జున్‌రెడ్డికి అప్డేట్ వెర్షన్‌లా ఉంది
ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ మీదున్న నమ్మకంతో యంగ్ టాలెంట్ సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు.
Siddharth Roy Movie | ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ మీదున్న నమ్మకంతో యంగ్ టాలెంట్ సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. ఈ కోవలోకి చెందిందే ‘సిద్ధార్థ్ రాయ్’. దీపక్ సరోజ్, తన్వినేగి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యశస్వీ దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్లను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. పోస్టర్లతోనే సినిమాలో హీరో క్యారెక్టర్రైజేషన్ ఎంత బోల్డ్‌గా ఉంటుందో చెప్పేశారు. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 తరహాలో మరో బోల్డ్ ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కినట్లు పోస్టర్లు చూస్తే తెలుస్తుంది.
రెండు సిగరెట్లు ఒకేసారి కాల్చడం, హీరోయిన్‌తో ఘాటు లిప్‌లాక్ పోస్టర్లు యూత్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇవేకాకుండా సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్ కూడా ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. నిజానికి ఈ సినిమా టైటిల్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమా కోసం గతంలోనే రిజిస్టర్ చేయించాడు. ఇక ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన యశస్వి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దాంతో టైటిల్ అడగ్గానే ఇచ్చేశాడట. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక సమ్మర్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి అర్జున్ రెడ్డి తరహాలోనే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించి దీపక్‌కు హీరోగా లైఫ్ ఇస్తుందో లేదో అని.
Harish Shankar, Allu Aravind Launched The Concept Poster And First Look Of Deepak Saroj, V Yeshasvi #SiddharthRoy
‘సిద్ధార్థ్ రాయ్’ కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన హరీష్ శంకర్, అల్లు అరవింద్https://t.co/2V4fumFkD1 pic.twitter.com/XjgiqWxwUX
— idlebrain.com (@idlebraindotcom) February 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

