Rahul Gandhi: ఇప్పుడు తొందరగా చేసుకోవాలి.. పెళ్లి గురించి రాహుల్ గాంధీ కామెంట్..వీడియో
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి కామెంట్ చేశారు. రాయ్ బరేలీలో జరిగిన సభలో ఆయన ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు. జనం నీ పెళ్లి గురించి అడుగుతున్నారని ప్రియాంకా గాంధీ చెప్పగా.. ఇక ఇప్పుడు తొందరల్లోనే చేసుకోవాల్సి ఉంటుందని రాహుల్ అన్నారు.
రాయ్ బరేలీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే సభకు వచ్చిన జనం ఓ ప్రశ్న వేశారు. దాని గురించి స్టేజ్ మీద ఉన్న ప్రియాంకా గాంధీ.. రాహుల్‌కు చెప్పింది. సభకు వచచిన జనానికి ముందు సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు. అప్పటికే ప్రసంగాన్ని ముగించిన రాహుల్.. సోదరి ప్రియాంకా చెప్పిన విషయాన్ని గమనించి బదులిచ్చారు. జనం పెళ్లి గురించి అడుగుతున్నట్లు ప్రియాంకా చెప్పగానే.. మీరేమి అడగాలనుకుంటున్నట్లు రాహుల్ మైక్‌లో అడిగారు. ఆ తర్వాత చిరు నవ్వు చిందిస్తూ.. ప్రశ్న ఏంటో అడగండి అంటూనే ఆయన ఓ విషయాన్ని చెప్పారు. ఇక ఇప్పుడు తొందరల్లోనే చేసుకోవాల్సి ఉంటుందని పెళ్లి గురించి రాహుల్ కామెంట్ చేశారు. అబ్ జల్డీ కర్నీ పడేగి అంటూ వ్యాఖ్యానించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది.
VIDEO | Lok Sabha Elections 2024: Here’s how Congress leader Rahul Gandhi (@RahulGandhi) responded when people asked him about his marriage during a public gathering in UP’s Raebareli.
“Now, I will have to get married soon.”#LSPolls2024WithPTI #LokSabhaElections2024
(Full… pic.twitter.com/eTkGhsW87L
— Press Trust of India (@PTI_News) May 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

