Miss You | చిన్నా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సిద్దార్థ్ (Siddharth) గతేడాది మిస్ యూ (Miss You) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. కలథిల్ సంతిప్పోమ్, మాప్లా సింగం చిత్రాల ఫేమ్ ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 13న తెలుగులో విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది.
కాగా థియేటర్లలో నిరాశ పరిచిన ఈ చిత్రం ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. మిస్ యూ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా ఇబ్బందుల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మరి డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ ఈ సినిమాను నిర్మించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కరుణాకరన్, బాలశరవణన్, సాస్తిక రాజేంద్రన్, ‘లొల్లు సభ’ మారన్ తదితరులు ఈ సినిమాల కీలక పాత్రల్లో నటించారు.
Now streaming 🍿🎬 #Missyou | #TheSabarmatiReport | #BachchalaMalli | #HideNSeek pic.twitter.com/0nG08oIVf2
— Tamilmemes3.0 (@tamilmemes30) January 10, 2025
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్