న్యాచురల్ స్టార్ హీరో నాని నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్. పీరియాడిక్ డ్రామాగా హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతిశెట్టి ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. నాని టీం నుంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. శ్యామ్ సింగరాయ్ ఫైనల్ షెడ్యూల్ షూట్ హైదరాబాద్‌లో షురూ అయినట్టు మేకర్స్ వెల్లడించారు. బిహైండ్ సీన్స్ స్టిల్ ఒకటి నాని షేర్ చేసుకున్నాడు.
శ్యామ్ ఈజ్ బ్యాక్..చివరి షెడ్యూల్ మొదలైంది అంటూ ట్వీట్ చేశాడు. నాని బ్యాక్ లుక్‌లో కనిపిస్తుండగా..చుట్టూ త్రిశూలాలున్నాయి. అసమానతలను ఓడించేందుకు యాక్షన్ లోకి దిగాడు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్ట్ చేస్తున్న శ్యామ్ సింగరాయ్‌ను నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం పదెకరాల విస్తీర్ణంలో భారీ సెట్ వేశారు టీం.
Shyam is back 🙂
— Nani (@NameisNani) July 1, 2021
Last schedule begins 🔥#ShyamSinghaRoy pic.twitter.com/crTtJCJO0s
𝘽𝘼𝘾𝙆 𝙄𝙉 𝘼𝘾𝙏𝙄𝙊𝙉 🎥 to defeat all the odds 💪
— Niharika Entertainment (@NiharikaEnt) July 1, 2021
Kick Started The Final Schedule of #ShyamSinghaRoy 🔱 🎬
Natural 🌟 @NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @Rahul_Sankrityn @MickeyJMeyer @NeerajaKona @vboyanapalli @SVR4446 @NiharikaEnt pic.twitter.com/7mxwEJlLVr
ఇవి కూడా చదవండి..
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో