Coolie | లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ డైరెక్టర్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)తో తెరకెక్కిస్తున్న చిత్రం కూలీ (Coolie). ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా శృతిహాసన్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుందని తెలిసిందే. ఈ మూవీలో తన పాత్ర గురించి కొన్ని విషయాలు షేర్ చేసింది శృతి హాసన్.
కూలీలో నా పాత్ర అందరూ యాక్టర్లతో కలిసి సాగుతుంది. చాలా మంది స్టార్లున్న సినిమాలో భాగం కావడం, వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పింది. అంతేకాదు కూలీ ఆసక్తికర కథనంపై ప్రశంసలు కురిపించింది. హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన కథలో కీలకంగా సాగేలా ఉండబోతుందన్నది. ఇక లోకేశ్ కనగరాజ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్, తలైవా స్క్రీన్ ప్రెజెంటేషన్ కూలీని బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలుపబోతున్నాయని ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్ండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
They call him OG | ఓజీ ఫీవర్.. మహేశ్ బాబు రికార్డ్ బీట్ చేసిన పవన్ కల్యాణ్.. !