Baahubali The Epic | నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్ నుంచి పలు సినిమాల అప్డేట్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాహుబలి టీమ్ కూడా ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకొని ఒక స్పెషల్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో బాహుబలి సెట్స్‌లో ప్రభాస్ చేసిన అల్లరి కనిపిస్తుంది. ‘ఎంత పనిచేశావు దేవసేన’ అంటూ రానాతో ముచ్చటిస్తూ ప్రభాస్ కనిపించారు. మధ్యలో అనుష్క రావడం చూడవచ్చు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఉన్న ఈ చిత్రం ‘బాహుబలి: ది ఎపిక్’పేరుతో ఒకే భాగంగా రాబోతుంది.
Every day on set felt like #FriendshipDay 🤗#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty #BaahubaliArchives#Baahubali #BaahubaliTheEpic #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/tXDLsbaGxm
— Baahubali (@BaahubaliMovie) August 3, 2025