They call him OG | హరిహరవీరమల్లు పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానుల ఆశలన్నీఓజీ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఓజీ గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తుండగా.. తాజాగా Fire Storm అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. కాగా మూడేళ్ల తర్వాత మహేశ్ బాబు రికార్డును అధిగమించి వార్తల్లో నిలిచాడు పవన్‌కల్యాణ్ .
శనివారం మధ్యాహ్నం విడుదలైన ట్రాక్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందని చెప్పకనే చెబుతోంది. ఈ ట్రాక్ 24 గంటల్లోనే 6.2 మిలియన్లకుపైగా వ్యూస్, 8,30,000కుపైగా లైక్స్‌తో మహేశ్‌బాబు సర్కార్ వారి పాటలోని కళావతి సాంగ్‌పై ఉన్న 8,06,000 లైక్స్ రికార్డును బీట్ చేసింది. ఈ రెండు పాటలను ఎస్ థమన్ కంపోజ్ చేయడం విశేషం. థమన్ మ్యూజికల్ జర్నీలో ఇది అరుదైన మైల్ స్టోన్లో అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఓజీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.