Shriya Saran |ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు శ్రియాశరణ్ (Shriya Saran). 2001లో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది శ్రియా శరణ్. ఈ భామ నటించిన దృశ్యం 2 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ విషయంలో సీనియర్ హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇటీవలే కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కబ్జ సినిమాలో కూడా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. కాగా ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అదేంటంటే..? మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ (Bhola Shankar )లో ఐటెం సాంగ్ (Item Song)కోసం శ్రియాను సంప్రదించినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ అడిగిందన్న టాక్ కూడా జోరుగా నడుస్తోంది. ప్రస్తుతానికి ఈ వార్త అఫీషియల్ ఏమీ కాకున్నా.. తాజా అప్డేట్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఒకవేళ ఇదే నిజమైతే శ్రియా శరణ్ క్రేజ్ మరింత పెరిగి ఐకానిక్ స్టార్‌గా మారిపోవడం ఖాయమైనట్టేనంటున్నారు ట్రేడ్ పండితులు. దీనిపై రాబోయే రోజుల్లో చిరంజీవి టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. చిరు సోదరి పాత్రలో కీర్తిసురేశ్ నటిస్తోంది. ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది భోళా శంకర్. ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ చిత్రంలో నటిస్తోంది శ్రియా శరణ్.
OG | ఓజీ సెట్స్‌లో పవన్ కల్యాణ్.. స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్ ఖుషీ
Anni Manchi Sakunamule | అన్నీ మంచి శకునములే నుంచి గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్